![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో ట్రోల్స్ కి ఉండే క్రేజే వేరు. ఈ ట్రోల్స్ లో కొన్ని సినిమాల మీద, మరికొన్ని పొలిటికల్ మీద ఉంటాయి. అయితే స్టుడెంట్స్ ఫ్రస్టేషన్స్ తో చేసే కొన్ని రీల్స్, ట్రోల్స్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. అందులోను ఇన్ స్టాగ్రామ్ లో వచ్చే ట్రోల్స్ కి క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నవాటిల్లో.. ఆ కుర్చీని మడతబెట్టి.. అనేది ఒకటి ఉండగా, ఇప్పుడు తాజాగా ఒక స్టుడెంట్ న్యూటన్ ని తిడుతున్నది ట్రెండింగ్ లో ఉంది. దానికి సెలెబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్రోల్ కి బిగ్ బాస్ సీజన్-6 లో కంటెస్టెంట్ ఆరోహి రావు స్పందించింది.
ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.
బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఆరోహి. హౌస్ నుండి బయటకొచ్చాక ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఒక స్టుడెంట్ న్యూటన్ ఎందుకురా ఆ 'న్యూటన్ లా' అని కనిపెట్టావ్.. నీ వల్ల మా చదువులు ఇలా తగలడ్డాయి అంటూ అతను తన ఫ్రస్టేషన్ ని ఆ వీడియోలో చెప్పాడు. దీంతో స్టుడెంట్స్ అంతా ఈ వీడియోకి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన న్యూటన్ ని తిడుతున్న ఈ వీడియోని చక్కర్లు కొడుతుంది. దానికి ఆరోహీ స్పందించి.. ఏం ఉన్నారబ్బా ఈ జనరేషన్ స్టుడెంట్స్.. ముడ్డి మీద నాలుగు సర్తే మాట సక్కగైతది. మిమ్మల్ని మట్టల మీద కొట్టే మాస్టర్లు తక్కువై ఇట్లా తయారయ్యారు. మా 90's జనరేషన్ వాళ్ళు అయితే డీసెంట్ గా ఉండేవాళ్ళమని చెప్తూ ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
![]() |
![]() |